బేగంపేట ఆగస్టు 6(జే ఎస్ డి ఎం న్యూస్) :
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్బంగా బుధవారం హైదరాబాద్ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. మెట్రో రైల్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఎండీ ఎన్ వి.ఎస్ రెడ్డి ప్రొఫసర్ జయశంకర్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా మెట్రో రైల్ అధికారులు, సిబ్బంది ని ఉద్దేశించి మాట్లాడుతూ జయశంకర్ నిస్వార్థ సేవలను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆయన చేసిన అవిశ్రాంత పోరాటాన్ని శ్లాఘించారు. ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషిచేయాలని, ఆయన కలలను సాకారం చేయాలని శ్రీ ఎన్వీఎస్ పిలుపునిచ్చారు. హెచ్ఎంఆర్ఎల్ అధికారులు, సిబ్బంది ప్రొఫసర్ జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
