ప్రతి ఒక్కరికి సమాచార హక్కు చట్టంపై అవగాహన అవసరమని జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి అన్నారు. తాళ్లూరు మండల పరిషత్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మారం మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సచివాలయం పరిధిలోని ప్రజలందరికి సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎంపీడీఓ దారా హనుమంతరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండి అర్జీదారుడు అడిగిన సమాచారాన్ని నిర్ణీత సమయంలో ఇవ్వాలని చెప్పారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బి.ప్రసాదరావు, ఎంఈఓ జి. సుబ్బయ్య, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

