జిల్లాల్లో చేపడుతున్న రీ సర్వే ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పటిష్టంగా నిర్వహించాలని సిసిఎల్ఎ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కల్లెక్టర్లకు సూచించారు.
విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి గురువారం జిల్లాల్లో చేపడుతున్న రీ సర్వే ప్రక్రియ పురోగతి, పైలెట్ గ్రామ నోటిఫికేషన్ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసిఎల్ఎ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాల్లో చేపడుతున్న రీ సర్వే ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పటిష్టంగా నిర్వహించాలని, అలాగే నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్లకు సూచించారు.
ఒంగోలు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ బాష తదితరులు పాల్గొన్నారు.

