ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఆదేశాల మేరకు పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో త్రిపురాంతకం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తముడివేముల గ్రామ శివారులో గురువారం ఎస్సై శివబసవరాజు మరియు వారి సిబ్బంది పేకాట స్థావరంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఐదు మోటార్ సైకిళ్లు, ఆరు సెల్ ఫోన్లు మరియు రూ.1,02,150/- నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో భాగంగా జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే, జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ఉంటే, వెంటనే డయల్ 112 నంబర్‌కు లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు మెసేజ్ ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరారు.
