ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పీ -4 సర్వేను వేగవంతం చెయ్యాలని దర్శి నియోజక వర్గ ప్రత్యేక అధికారి జాన్ నన్ అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో గురువారం అధికారులు, విఆరీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీ- 4 పథకంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు చురుకైన పాత్ర పోషించనున్నారని అందుకు ముందుకు సర్వేను పూర్తి చేసి లక్ష్యాలను నిర్ణయించాల్సి ఉందని అన్నారు. మండలంలో కేవలం 15శాతం మాత్రమే పూర్తి అయి పూర్తిగా జిల్లాలో వెనకబడి ఉందని అన్నారు. సోమవారం లోపు ఎట్టిపరిస్థితులలో సర్వే పూర్తి చెయ్యాలని ఆదేశించారు. తహసీల్దార్ ఎంవీ రమణా రావు, విఆర్ఓలు పాల్గొన్నారు.
