సీజన్ ప్రారంభమైనందున ఎరువుల కొరకు రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. తూర్పుగంగవరంలో ఎరువుల దుకాణాలను ఆయన గురువారం తనిఖీ నిర్వహించారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. రైతు సేవా కేంద్రాలకు 132 మెట్రిక్ టన్నుల యూరియా కావాలని ఇండెంట్ పెట్టినట్లు చెప్పారు.
రైతులు విచ్చల విడిగా ఎరువులు వాడరాదని తెలిపారు.

