నాగంబొట్ల పాలెంలో పోలేరమ్మ కొలుపులు ఐదవ రోజు ఉత్సాహంగా సాగాయి. మహాలక్ష్మి చెట్టు వద్ద పొంగళ్లు పెట్టారు. అధిక సంఖ్యలో మహిళలు పొంగళ్లు పెట్టి నైవేద్యాలు చెల్లించారు. పోలేరమ్మ తల్లికి గ్రామోత్సవం బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ గ్రామ వీధులలో ఉ త్సవం నిర్వహించారు. 56 సంవత్సరాల క్రితం అమ్మవారికి కొలుపులు నిర్వహించగా తిరిగి మరలా ఈ సంవత్సరం నిర్వహిస్తుండటంతో వైభవంగా ఏర్పాట్లు చేసారు. బంధు మిత్రుల రాకతో గ్రామంలో భక్తి భావం తొనికిసలాడుతుంది.
