దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నైపుణ్యాభివృద్ధి పెంపుదల చేయుటకు ప్రభుత్వ ప్రైవేటు సంస్థలతో చేసుకున్న ఓప్పందాలు, లబ్దిదారులు, ప్రైవేటు భాగస్వామ్యంతో నైపుణ్యాభివృద్ధి పెంపుచర్యలు గురించి ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశ్నను అడిగారు . అందుకు
కేంద్ర నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి జయంత్ చౌధరీ సమాదానమిస్తూ …
దేశంలో గ్రామీణ ప్రాంతాలతో పాటు అన్ని ప్రాంతాలలోని వారికి నైపుణ్యాభివృద్ధి పెంపుదలకు పి.యం. కుశాల్ వికాస్ యోజన, జం సిక్షన్ సంస్థాన్, నేషనల్ ట్రైనింగ్ ప్రమోషన్ స్కీం, క్రాఫ్ట్స్ మెన్ ట్రైనింగ్ స్కీం మొదలగు పధకాలను పారిశ్రామిక శిక్షణ సంస్థల ద్వారా కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ పలు ప్రభుత్వ సంస్థలతో అమలుచేయుచున్నదని తెలిపారు.
ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంతో ఆధునిక సాంకేతికలను మరియు వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రజలకు కలుగజేయబడుచున్నదని, దీనిక్రింద 25 లక్షల మంది యువత లబ్ది పొందారని తెలిపారు. ప్రపంచ అవసరాలకు తగ్గట్టు, దేశ ప్రజలు ముఖ్యంగా యువత నైపుణ్యాల పెంపుదలకు అనేక జాతీయ మరియు అంతర్జాతీయ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం మరియు సహకారంతో, అనేక వృత్తి విధ్య మరియు శిక్షణ కార్యక్రమాలను మరియు ప్రాజెక్టులను ప్రభుత్వం అమలుచేయుచున్నదని కేంద్ర మంత్రి తెలియజేశారు.