ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణం కల్పించటం పట్ల మండల మహిళా సమాఖ్య ఆద్వర్యంలో సీఎంచంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణకు సోమవారం మహిళలు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక వెల్లంపల్లి బస్టాండ్ సెంటర్ లో కెనరా బ్యాంక్ సమీపాన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్ చిత్ర పటాలకు పాలాబిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల మహిళాసమాఖ్య అధ్యక్షురాలు ఎం.సుజాత, మహిళలు పాల్వాది విజయ లక్ష్మి, కోట అంజమ్మ, ఏసమ్మ, ప్రమీల, మహిళలు పాల్గొన్నారు.
