తాళ్లూరు మండలంలోని వెలుగు వారి పాలెం ప్రాధమిక పాఠశాల (ఎఎ)లో సోమవారం విద్యార్థులకు కంటి చూపు పరీక్షను వైద్య సిబ్బంది నిర్వహించారు. కంటి చూపు మందగించిన వారికి అద్దాలు లేదా ఇతర సమస్యలు కనుగోంటే జిల్లా వైద్యశాలకు సిఫార్స్ చేస్తామని చెప్పారు. హెచ్ఎం పోలం రెడ్డి సుబ్బా రెడ్డి, సీహెచ్ఐ ప్రభావతి, ఎఎన్ఎం సీహెచ్ సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
