ప్రజా ఫిర్యాదులపై వెంటనే విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందేలా చేయాలి -ప్రకాశం జిల్లా ఎస్పీ ఎ. ఆర్ దామోదర్-పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ (మీ కోసం) కార్యక్రమంకు 64 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదులను పరిష్కారించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మరియు పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజలు వారి ఫిర్యాదుల గురించి జిల్లా ఎస్పీ మరియు పోలీస్ అధికారులుకు విన్నవించుకున్నారు. ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి వారి ఫిర్యాదుల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో అందిన ఆయా ఫిర్యాదులపై జిల్లా ఎస్పీ సంబందిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు. పోలీసు శాఖ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించటం జరుగుతుందని, ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చు. ఈ కార్యక్రమంలో కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, చీటింగ్/జాబ్ ఫ్రాడ్, ఎక్కవగా భూ వివాదాలు మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, ఎస్సీ/ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ జగదీష్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *