అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కరించాలి -జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ

పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కారించేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, అధికారులను ఆదేశించారు.
సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, శ్రీధర్ రెడ్డి, కుమార్, జాన్సన్ లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ, మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఆయా శాఖల జిల్లా అధికారులు నాణ్యతగా అర్జీలను పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. రీఓపెన్ కాకుండా అర్జీలను సకాలంలో, గడువులోగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. అర్జీలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *