పొలాలకు వేప, ఆముదపు పించి వాడాలి

పంట పొలాలకు వేప, ఆముదపు పిండి, కానుక పిండి వంటివి వాటినట్లయితే పంగలకు చీడ పీడలు సోకవని వ్యవసాయాధికారి ప్రసాద రావు అన్నారు. మండలంలోని రామభద్రాపురం, తూర్పుగంగవరం లలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ నందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకరాకు రెండు క్వింటాళ్లు వేప పిండి లేదా కానుక పిండి, వేరుశ శనగ పిట్టు వాడటం వలన బహుళ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. కొంచెం శ్రమించటం వలన అనేక లాభాలు ఉన్నాయని చెప్పారు. వరి పైరును పరిశీలించి సస్య రక్షణ చర్యలు వివరించారు. అధిక మొత్తంలో రసాయనిక ఎరువుల వాడకం వలన అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. విఏఏ ప్రియ, సుప్రియ, ప్రకృతి సాగు ఇన్చార్జి పి నరసింహా ఐసీఆర్పీలు కోటి రత్నం, అనంత లక్ష్మి, కోటి, ఇన్స్ట్స్యూరెన్స్ కోఆర్డినేటర్ అనిల్ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *