డిజిటల్ మైక్రో క్రెడిట్ ప్లాన్స్ ను త్వరగా ఆమోదించాలి – జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.తమీమ్ అన్సారియా

    డిజిటల్ మైక్రో క్రెడిట్ ప్లాన్స్ ను త్వరగా ఆమోదించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ.తమీమ్ అన్సారియా 

బ్యాంకర్లకు సూచించారు. డిఆర్డిఏ లోని పొదుపు సంఘాల మహిళలకు రుణాల మంజూరు పై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పరిస్థితిని డిఆర్డిఏ పిడి నారాయణ ఈ సందర్భంగా కలెక్టరుకు వివరించారు. పొదుపు సంఘాల మహిళలు రుణాలను తిరిగి చెల్లించడంలో చురుకుగా ఉన్నారని ఆయన తెలిపారు. గతంలో వీరికి రుణాలు మంజూరు చేయడానికి గ్రూపులోని సభ్యులందరూ సంతకాలు చేసిన పత్రాలను బ్యాంకులకు సమర్పించే వారని చెప్పారు. ఇప్పుడు బయోమెట్రిక్ వేలిముద్ర వేయటం ద్వారా గ్రూపు సభ్యులు తమ అంగీకారం తెలుపుతున్నారని వివరించారు. నూతనంగా ప్రవేశపెట్టిన ఈ విధానం ద్వారా మైక్రో క్రెడిట్ ప్లాన్స్ ను బ్యాంకులు ఆమోదించటంలో కొంత జాప్యం జరుగుతున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియలో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ను వచ్చే నెలలో ప్రభుత్వం ఇస్తుందన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా మైక్రో క్రెడిట్ ప్లాన్స్ ను బ్యాంకర్లు ఆమోదిస్తే ఎంత మొత్తంలో పొదుపు సంఘాలకు రుణాలు అవసరమో ఒక అవగాహన వస్తుందని పీడీ చెప్పారు.
దీనిపై కలెక్టర్ స్పందిస్తూ త్వరగా ఈ తాత్కాలిక డిజిటల్ అప్రూవల్స్ ను ఇవ్వాలని బ్యాంకర్లకు సూచించారు. ఈ విషయాల్లో బ్రాంచ్ మేనేజర్లకు అవగాహన కల్పించేలా గురు, శుక్రవారాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పారు. బ్యాంకర్లకు ఏపీఎంలు కూడా అందుబాటులో ఉండేలా చూడాలని పీ.డీ.ని ఆమె ఆదేశించారు. మైక్రో క్రెడిట్ ప్లాన్స్ ను ఆమోదించడములో జిల్లా స్థానం మెరుగ్గా ఉండాలని ఆమె అన్నారు. అంతేకాకుండా డ్వాక్రా సంఘాల మహిళలు చేస్తున్న పొదుపు డబ్బులలో 75% ఫిక్స్డ్ డిపాజిటివ్ చేయాలని, మిగతా 25 శాతం డబ్బులను అంతర్గత రుణాలకు ఇవ్వాలని కలెక్టర్ చెప్పారు. పది రోజులలో ఈ మేరకు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు.
ఈ సమావేశంలో ఎల్.డి.ఎం.రమేష్, బ్యాంకుల రీజినల్ మేనేజర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *