సైబర్ నేరాల బారిన పడకుండా విద్యార్దులకు అవగాహన కల్పించిన ప్రకాశం జిల్లా పోలీసులు -సైబర్ నేరాలు పట్ల అవగాహన కలిగి ఉండి మీ విలువైన ధనాన్ని కాపాడుకోండి

ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ ఆదేశాల మేరకు ఐటి కోర్ ఇన్స్పెక్టర్ వి.సూర్యనారాయణ ఒంగోలులోని క్వీజ్ ఇంజినీరింగ్ కాలేజీ లో విద్యార్దులకు సైబర్ మోసాలపై మంగళవారం అవగాహన కల్పించారు. రోజూ రోజూ కూ సైబర్ నేరాలు పెరిగి పోతున్నాయని ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సైబర్ నేరాల గురించి తెలియజేయాలన్నారు. చదువుకోని వారు, చదువుకున్నవాళ్ళు కూడా ఇద్దరూ సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోతున్నారన్నారు. ఫేక్ ఎస్ఎంఎస్ లు, ఓటీపీ మోసాలు, బ్యాంకు నుండి అని ఫోన్లు, వాట్సప్‌ల ద్వారా వచ్చే ఫేక్ లింక్స్, ఫేక్ లోన్ యాప్స్, మీ కేవైసీ పెండింగ్ అని జరిగే మోసాలు, డిజిటల్ అరెస్ట్ అనగా పోలీస్, సిబిఐ, వివిధ ఉన్నత శాఖల అధికారులంటూ ఫోన్ చేసి డబ్బులు వసూలు చేయడం, కొరియర్ పేరుతో మోసాలు, లోన్ యాప్, హ‌నీ ట్రాప్‌, లాటరీల పేరుతో మోసాలు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్టు మోసాలు, తక్కువ డబ్బులు పెట్టుబడి పెడితే అధికంగా డబ్బు ఇస్తామని, వీడియోకాల్స్ చేసి స్క్రీన్ రికార్డు చేసి బ్లాక్ మెయిలింగ్ మరియు తదిత‌ర సైబ‌ర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

మొదటగా ఎవరు కూడా వారి డబ్బులను ఊరకనే ఇవ్వరనే విషయాన్ని గుర్తించాలని, అత్యాశలకు పోకూడదని, ప్రతి ఒక్క విద్యార్థి వారి వారి తల్లిదండ్రులకు, చుట్టుపక్కల వారికి తెలియజేసి వారికి అవగాహన కలిగించి సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రతలు తీసుకోవాలని సి.ఐ సూర్యనారాయణ గారు సూచించారు. ఒకవేళ సైబర్ క్రైమ్ లో బాధితులయితే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930 ఫిర్యాదు చేసి తగిన వివరాలు తెలపడం ద్వారా కొంతమేర నష్టపోయిన డబ్బును తిరిగి పొందచ్చని తెలపడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *