ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సిసిఎల్ఎ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్లకు సూచించారు.
విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, కాస్ట్ సుమోటో డ్రైవ్, జాయింట్ ఎల్పీఎం, అటవీ భూముల సమస్యలకు పరిష్కారం, అన్నదాత సుఖీభవ తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిసిఎల్ఎ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేసారు. ఈ సందర్భంగా సిసిఎల్ఎ జాయింట్ సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాజముద్రతో తయారు చేసిన కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల్లో చేపట్టిన రీ సర్వే ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్లకు సూచించారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పధకాలకు సంబంధించి మరియు అటవీ భూములకు సంబంధించి జాయింట్ ఎల్పీఎం సమస్యలకు పరిష్కారం చూపేలా జాయింట్ కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు ఒంగోలు కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుండ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ వరకుమార్, జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అధికారి గౌస్ భాషా, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సిబ్బంది తదితరులు తదితరులు పాల్గొన్నారు.


