రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినఉల్లాస్- అక్షర ఆంధ్ర అక్షరాస్యతా కార్యక్రమము విజయవంతం చేయాలి -జిల్లా కలెక్టరు ఎ. తమీమ్ అన్సారియా

ఉల్లాస్-అక్షర ఆంధ్ర అక్షరాస్యతా కార్యక్రమం పై ఒంగోలు కలెక్టరేట్ లోని పి.జి.ఆర్.యస్ హాలులో జిల్లా కలెక్టరు ఎ. తమీమ్ అన్సారియా అద్యక్షతన జిల్లా అధికారుల సమక్షంలో ఎం.పి.డి.ఓ., ఎం.ఇ.ఓ., డి.ఆర్.డి.ఎ-ఎ.పి.యం., డి.డబ్ల్యు.యం.ఎ- ఎ.పి.ఓ., నగరపాలక కమీషనర్లు, సిటీ మిషన్ మేనేజర్లకు జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమము మంగళవారం నిర్వహించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ…… ఉల్లాస్- అక్షర ఆంధ్ర అక్షరాస్యతా కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, దీనికి సంబందించి సంబంధిత జిల్లా అధికాలందరూ తమ సహకారం, తోడ్పాటు అందించాలని తమ ప్రసంగంలో కోరారు. 15-59 సం॥ ల మధ్య నిరక్షరాస్యులైన వయోజనులకు ఉద్దేశించిన సాంకేతికత, వయోజన విద్య అందుబాటులోకి తెచ్చే కార్యక్రమమని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో స్వచ్ఛంద బోధకులుగా కనీసం 10వ తరగతి విద్యార్హత గల వారు ఎవరైనా సరే 10 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయవలసి ఉంటుందని చెప్పారు. ఇది స్వచ్ఛందంగా జరిపే కార్యక్రమమని తెలియజేశారు.
జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ…. నిరక్షరాస్యులైన యస్.హెచ్.జీ మహిళలకు ఉల్లాస్-అక్షర ఆంధ్ర అక్షరాస్యతా కార్యక్రమము ఒక వరమని పేర్కొన్నారు.

జెడ్.పి., సి.ఇ.ఓ ఎం.పి.డి.ఓ లకు., డి.ఆర్.డి.ఎ., పి.డి., ఎ.పి.యం లకు, మెప్మా పి.డి. , సి.యం.యం., సి.ఓ., ఆర్.పి లకు, డ్వామా పి.డి. , ఎ.పి.ఓ లకు, డి.ఇ.ఓ , ఎం.ఇ.ఓ లకు ఉల్లాస్-అక్షర ఆంధ్ర అక్షరాస్యతా కార్యక్రమము గ్రామ స్థాయిలో విజయవంతం అగుటకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు బి.జగన్మోహన రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమములో వయోజన విద్యా శాఖ పర్యవేక్షకులు, అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారులు మరియు గణాంక అధికారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *