క్షేత్ర స్థాయిలో పథకాల అమలు అన్ని శాఖల సమన్వయం కీలకం

క్షేత్ర స్థాయిలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు మండల స్థాయిలో అన్ని శాఖల సమన్వయం మరింత కీలకమని ఇన్చార్జి ఎంపీడీఓ సానికొమ్ము సత్యం అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం మండల స్థాయి అధికారుల సమన్వయ సమావేశం ఎంపీడీఓ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎంతో ప్రతి ష్టాత్మకంగా నిర్వహిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఎంత వరకు చేరుతున్నాయి, వాటి వివరాలు ఎప్పటికప్పుడు ఎంపీడీఓ కార్యాలయానికి తమ శాఖల పధరిలో నమాచారం ఇవ్వాలని చెప్పారు. ఇక పై ప్రతి నచివాలయాన్ని తాము పర్యవేక్షిస్తామని చెప్పారు. ఆయా శాఖల పరిధిలో తమకు ఇచ్చిన లక్ష్యాలను చేరక పోయినా నిర్లక్ష్యంగా ఉన్నా తగిన చర్యలు తప్పవని అన్నారు. తమ పరధిలోని సిబ్బందిని అప్రమత్తం చేసి జిల్లా స్థాయిలో కేటాయించిన లక్ష్యాలను చేరుకునేలా తగిన సూచనలు ఇవ్వాలని కోరారు. ఇకపై ప్రతి బుధవారం నమావేశం నిర్వహించి సమీక్షిస్తానని చెప్పారు. వర్షాలు కురుస్తున్నందున పారిశుధ్యం, తాటి నీటి సరఫరాలో నిర్లక్ష్యం లేకుండా చూడాలని స్పష్టం చేసారు. ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటల పెంపకానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చినందున వీలున్నంత వరకు లక్ష్యాలను చేరుకోవాలని కోరారు. నీటి సంరక్షణ నిర్మాణాలను త్వరగా పూర్తి చెయ్యాలని కోరారు. ఈ నెలాఖరు లోగా నీటి ఇంకుడు గుంతలు పూర్తి చెయ్యాలని చెప్పారు. పీ- 4 పథకం నిర్వహణ తీరు తెన్నులను, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, దివ్యాంగుల పెన్షన్ల పునః పరిశీలన, నూతన రేషన్ కార్డుల మంజూరువంటి అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఫణీంధ్ర వ్యవసాయాధికారి ప్రసాద రావు, ఎంఈఓ -2 సుధాకర్ రావు, ఎపీఓ వెంకట రావు, ఎపీఎం నుధాకర రావు, హౌసింగ్ ఎ.ఈ హనుమంత రావు, ఆర్ డబ్ల్యుఎన్ ఎఈ వాలి, ఐసీడీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *