కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు డాక్యుమెంట్ల ధృవీకరణకు హాజరుకావాలి -ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్-కానిస్టేబుల్ జాబ్స్ కు ఎంపికైన అభ్యర్థులకు పలు సూచనలు- కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు 22వ తేదీ ఉదయం 9 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరుకావాలి

గత డిసెంబర్ మరియు జనవరి నెలలలో ప్రకాశం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరైన అభ్యర్థుల్లో, సివిల్ మరియు  ఏపీఎస్పీ  విభాగాల్లో   ఎస్సీటీ -పీసీ లుగా తుది రాత పరీక్షలో ఎంపికైన పురుష మరియు మహిళా అభ్యర్థులు, ఆగస్టు 22వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు సంభందించిన డాక్యూమెంట్స్ తీసుకోని ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరుకావాలని జిల్లా ఎస్పీ  ఏ.ఆర్. దామోదర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

*అభ్యర్థులు తీసుకురావలసిన ధృవీకరణ పత్రాలు*….

– అభ్యర్ధులు సెలక్షన్ ప్రక్రియలో అప్పుడు అప్లికేషనుతో జతపర్చిన ధృవకరణ పత్రాలు అన్నియు ఒరిజినల్ సర్టిఫికేట్స్,

– పై అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు గెజిటెడ్ అధికారితో అటెస్టేషను చేయించిన మూడు సెట్ల జెరాక్స్ కాపీలు,

–  ఇటీవల తీయించిన ఆరు పాస్పోర్టు సైజ్ కలర్ ఫోటోలతో తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

– తదుపరి,హాజరైన అభ్యర్ధి అటెస్టేషను ఫారం నందు పూర్తి వివరాలు పొందుపరిచిన తర్వాత గెజిటెడ్ అధికారితో ధృవీకరణ చేయంచడం తప్పనసరి అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *