స్వచ్చాంద్రా కార్యక్రమాన్ని పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలి -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్

ఈ నెల 23 న 4వ శనివారం. స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్చాంద్రా కార్యక్రమాన్ని పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఏపీ సచివాలయంలోని సిఎస్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, వర్చువల్ గా జిల్లా కలెక్టర్ల తో సమావేశమై
ఎంఐ ట్యాంకులు & గ్రౌండ్ వాటర్, సానుకూల ప్రజా దృక్పథం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్‌లోడ్, స్వామిత్వ కార్యక్రమం, స్వచ్ఛ ఆంధ్ర అవార్డులపై సూచనలు, దిగువ కోర్టులలో ఖాళీగా ఉన్న లా ఆఫీసర్ పోస్టుల భర్తీ, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

ఒంగోలు జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డి పి ఓ వెంకట నాయుడు, హౌసింగ్ పిడి శ్రీనివాస ప్రసాద్, సిపిడీసీఎల్ ఎస్ ఈ వెంకటేశ్వర రావు, మైన్స్ డిడి రాజశేఖర్, నగర పాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర రావు, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ వరలక్ష్మి, డి ఎస్ ఓ పద్మశ్రీ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ….. ఈ నెల 23వ తేదీన డ్రైన్ క్లీనింగ్ , పారిశుధ్యం ప్రధానాంశంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిసర ప్రాంతాల్లో నీటి నిల్వలు లేకుండా చూడడం, దోమల నివారణకు మందులు స్ప్రి చేయడం, నీటి నాణ్యతలను పరీక్షించడం, పాఠశాలల్లో హాండ్ వాష్ పై అవగాహన కలిగించడం తదితర కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవడంతో పాటు
స్వచ్చాంద్రా కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థలు, డ్వాక్రా మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చూడాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. అక్టోబర్ 2న స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ఇవ్వనున్నట్లు సీఎస్ తెలిపారు. 12 విభాగాల వారీగా రేటింగులు ఇవ్వాలని, సేవా సంస్థలను భాగం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. స్వామిత్వ భూమి రికార్డుల సర్వే పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. భూగర్భ జలాలను మెరుగుపరచే చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ పథకాల అమలు పారదర్శకంగా చేపట్టడంతో ప్రజలు సంతృప్తి చెందేలా కార్యక్రమాలు ఉండాలని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *