హైదరాబాద్ ఆగస్టు 26(జే ఎస్ డి ఎం న్యూస్) :
మట్టి గణపతుల ఏర్పాటు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటుందని ఉత్తర మండల డిసిపి సాధన రష్మీ పెరుమాళ్ అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ సోమ సుందరం వీధిలో మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకులు, తులసి మొక్కల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన డిసిపి సాధన రష్మీ పెరుమాళ్ మాట్లాడుతూ తులసి మొక్కలను, మట్టి వినాయకులను పంపిణీ చేస్తూ మక్తాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మక్తాల జలంధర్ గౌడ్, సభ్యులు మంచి సందేశాన్ని అందిస్తున్నారని వారిని అభినందించారు. బహిరంగ ప్రదేశాలలో వినాయక మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తగిన భద్రతను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జలంధర్ గౌడ్ మాట్లాడుతూ…. ప్రస్తుతమున్న బిజీ లైఫ్ లో పర్యావరణం గురించి ఆలోచించే తీరిక ప్రజల్లో లేకుండా పోతుందని అందువల్లపర్యావరణాన్ని కాపాడడానికి మట్టి గణపతుల పూజ ఓ మార్గమని అన్నారు.
ప్రకృతి పరిరక్షణ కోసం మక్తాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి ఉచిత మట్టి గణపతుల పంపిణీ చేస్తున్నామని, పిఓపి ద్వారా తయారు చేసే విగ్రహాల వల్ల నీటి కాలుష్యం ఏర్పడడమే గాక జలాశయాలలో ఉండే చేపలు తదితర జలాచరులకు కూడా చేటు చేస్తుందని, వాటిని తిన్న మనుషులకు కూడాఆరోగ్యంక్షీణిస్తుందన్నారు. మట్టి వినాయకులను పూజిస్తూ పర్యావరణాన్ని రక్షించడం మానవాళి బాధ్యతగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అశోక్, మహంకాళి ఏసిపి సైదయ్య, ఇన్స్ పెక్టర్ పరుశురాం, నర్సింగరావు, రామకృష్ణ, ఎస్సైలు, మక్తల ఫౌండేషన్ సభ్యులు నరసింహ చారి, సూర్య ప్రకాష్, వెంకటేష్, వేణు, ప్రకాష్, మధుసూదన్, భాస్కర్, సుబ్రహ్మణ్యం, పూర్ణచందర్, శివకుమార్, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు .
