హైదరాబాద్ ఆగస్టు 26(జే ఎస్ డి ఎం న్యూస్ ):
బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వియ్యంకుడు మూల రాజ్ కుమార్ గౌడ్ కు బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి వీడ్కోలు పలికారు. రాజ్ కుమార్ గౌడ్ సోమవారం గుండెపోటుతో మరణించారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని నివాసం నుండి అంతిమయాత్ర ప్రారంభం కాగా మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజ్ కుమార్ గౌడ్ పాడె మోశారు. అంతకుముందు రాజ్ కుమార్ గౌడ్ బౌతికకాయంపై పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాయదుర్గం లోని గౌడ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి.

