హైదరాబాద్ ఆగస్టు 26(జే ఎస్ డి ఎం న్యూస్) :
పర్యావరణ హితమైన మట్టి గణపతిని పూజిద్దామని, సంప్రదాయ పూజ విధానాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సినీ హీరో శ్రీకాంత్ పేర్కొన్నారు. మట్టి గణపతుల ప్రచారం లో భాగంగా మంగళవారం ఫిల్మ్ నగర్ లోనీ శ్రీకాంత్ ఇంటికి వెళ్లిన సామాజిక కార్యకర్త పుట్టా రామకృష్ణ ఆధ్వర్యం లో శ్రీకృష్ణ నగర్ శ్రీవాస్తవ యువజన సంఘం సభ్యులు సినీ హీరో శ్రీకాంత్ కి మట్టి గణపతి అందజేశారు. మట్టి గణపతి ఇంటికి రావడం చాలా సంతోషం గా ఉందని, గత 2-3 సంవత్సరాలుగా వినాయక మట్టి విగ్రహం అందుకున్నట్టు పేర్కొన్నారు. మట్టి గణపతి ప్రచారం పై అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్కరు మట్టి గణపతిని పూజించాలని, ఇది ఒక మంచి సేవా కార్యక్రమం. అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో సోషల్ వర్కర్ పుట్టా రామకృష్ణ, సూర్య రావు, బుజ్జి, రాజారావు, వెంకట్రావు, శ్రీనివాస్ రావు, సర్వరావు, రాజేష్, యతి రాజ్, మహేష్ , రాజా, నవీన్, సాయి, జగన్, కిరణ్, నిరంజన్రం, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

