హైదరాబాద్ ఆగస్టు 26
(జే ఎస్ డి ఎం న్యూస్) :
పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు చిన్నారులు ముందడుగు వేస్తున్నారు. నగరానికి చెందిన శ్రీనిధి స్కూల్ ఆరో తరగతి విద్యార్థి పుట్టా కేదార్ రామ్ ప్రతి సంవత్సరం తన జేబు ఖర్చుతో 50 మట్టి గణపతులను కొనుగోలు చేసి, వాటిని స్నేహితులు మరియు పరిచయులకు పంపిణీ చేస్తూ వినూత్న సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో అతనికి అతని అక్క పుట్టా లిఖిత (8వ తరగతి, శ్రీనిధి స్కూల్) తోడ్పడుతోంది.మట్టి గణపతులను వినియోగించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని చిన్న వయసులోనే ప్రజల్లో అవగాహన కల్పించాలనే సంకల్పంతో వీరు ముందుకు వస్తున్నారు. జేబు ఖర్చును పక్కన పెట్టి సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే భావనతో ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.వీరికి ఇప్పటికే తెలంగాణ గవర్నర్, పలువురు మంత్రులు అభినందనలు తెలియజేశారు. సోషల్ మీడియాలో కూడా వీరి సేవా కార్యక్రమం ప్రశంసలు అందుకుంది.ఈ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ ఇళ్లలో, వీధుల్లో మట్టి గణపతులనే ప్రతిష్ఠించమని పుట్ట కేదార్ రామ్, లికిత విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న వయసులోనే సేవా భావాన్ని పెంచుకొని సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ చిన్నారులు, వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతులను వినియోగించమని పిలుపునిస్తూ ఈ పిల్లల సేవా చైతన్యం వెనుక తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన సామాజిక సేవకుడు పుట్టా రామకృష్ణ గత 15–20 ఏళ్లుగా నిరంతరం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి ప్రేరణతో పాటు తల్లి యొక్క విశేషమైన సహకారం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఉంది. చిన్న వయసులోనే సమాజానికి ఉపయోగపడే పనులు చేయడం ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అనేక మందికి ఈ కుటుంబం ఆదర్శంగా నిలుస్తోంది.
