మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు, రిటైర్డ్ పోలీసు సిబ్బంది మరియు హోం గార్డులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం -ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ – సమర్థవంతమైన పోలీసింగ్‌తో పాటు సిబ్బంది సంక్షేమానికి సదా కృషి చేస్తాం – సమాజ రక్షణలో తమ ప్రాణాలను అర్పించిన సిబ్బందిని పోలీస్ శాఖ ఎప్పటికీ మరచిపోదు -జిల్లా ఎస్పీ

ప్రకాశం జిల్లాలో విధులు నిర్వహిస్తూ వివిధ కారణాలతో మరణించిన, రిటైర్ అయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు, మరియు హోం గార్డులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ అన్నారు. సమర్థవంతమైన పోలీసింగ్‌తో పాటు సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని, సమాజ రక్షణలో ప్రాణాలర్పించిన సిబ్బందిని పోలీస్ శాఖ ఎప్పటికీ మరచిపోదన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మరణించిన మరియు రిటైర్ అయిన పోలీసు సిబ్బంది కుటుంబాలతో, హోమ్ గార్డ్స్ యొక్క సంక్షేమం కొరకు జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించినారు.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరితోనూ స్వయంగా మాట్లాడి, వారికి అందాల్సిన ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అనంతరం ఎస్పీ సిబ్బంది యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి చెందవలసిన రిటైర్మెంట్ ప్రయోజనాలు మరియు ప్రభుత్వం నుండి రావాల్సిన రాయితీలు త్వరితగతిన అందేలా చూస్తామని, వారి పెండింగ్ ఫైల్స్ గురించి అడిగి తెలుసుకొని వాటిని త్వరగా పూర్తి చేసేందుకు సంబంధిత డిపిఓ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కారుణ్య నియామకాలు పొందని కుటుంబ సభ్యుల యొక్క వివరాలు తెలుసుకొని, వారికి త్వరిత గతిన కారుణ్య నియామకం పొందే విధంగా కృషి చేస్తామని తెలిపారు. రిటైర్డ్ సిబ్బంది ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ఎస్పీ గ పలు సలహాలు సూచించారు. 

పోలీసు శాఖలో అంకిత భావంతో విధులు నిర్వర్తించే సిబ్బంది మరణించడం బాధాకరమన్నారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా ఉంటుందని, సర్వీస్ నందు లేకపోయినా మనం ఎప్పటికీ ఒకే పోలీస్ కుటుంబమని, ప్రకాశం పోలీసులు ఎల్లవేళలా వారికి బాసటగా ఉంటారని ఎస్పీ భరోసా ఇచ్చారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజాసేవకై అంకితమై రిటైర్మెంట్ పొందిన సిబ్బందిని మరియు వారి కుటుంబాలను కలుసుకోవడం ఆనందంగా ఉందని, వారి యొక్క సేవలను పోలీసు వ్యవస్థ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. ప్రభుత్వం తరుపున రావలసిన ప్రయోజనాలు త్వరగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని, పోలీస్ కుటుంబ సభ్యులకు ఏ సమస్య వచ్చిన తనను నేరుగా కలవచ్చునని ఎస్పీ తెలియచేసినారు. దూర ప్రాంతాల వారికి జిల్లా పోలీస్ కార్యాలయానికి ప్రత్యక్షంగా రావలసిన అవసరం లేదని, సంబంధిత సమాచారం ఫోన్ ద్వారా అందించవచ్చు లేదా సమీపంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చు అని తెలియజేశారు.

విధులు నిర్వర్తిస్తూ మరణించిన కీర్తి శేషులు ఎ మురళి సతీమణి సుధారాణికి ఇన్సిడెంటల్ చార్జెస్ క్రింద రూ. 25,000 చెక్కును జిల్లా ఎస్పీ అందచేసినారు.

ఈ కార్యక్రమంలో ఆర్ ఐ సీతారామిరెడ్డి, ఏ ఏ ఓ పి ఇ విజయ కుమార్, డీపీఓ సూపరింటెండెంట్ లు .సంధానిబాషా, డి.శైలజ మరియు డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *