ప్రజల కష్టాల్లో అండగా ఉంటూ అనేక సేవా కార్యాక్రమాలు నిర్వహించడం లో బూచేపల్లి కుటుంబ సభ్యులు ముందుంటారని ప్రతి ఒక్కరు ఆ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోని ముందుకు వెళ్లాలని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోశం మధు సూధన్ రెడ్డి అన్నారు.
మంగళవారం జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ పుట్టినరోజు సందర్భంగా తేజ వయో వృద్ధాశ్రమంలో
వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. కార్యక్రమంలోతాళ్లూరు,దర్శి వైసిపి మండల పార్టీ అధ్యక్షులు టి. వి సుబ్బారెడ్డి,వెన్నపూస వెంకటరెడ్డి,మాజీ ఎంపీపీ గోళ్లపాటి మోషే, ఉపాధ్యక్షులుపులి ప్రసాద్ రెడ్డి,ఆలోకం హరిబాబు,మండల కార్యదర్శి భీమిని సుబ్బారావు,
,మండల రైతు విభాగం, మైనారిటీ సెల్ అధ్యక్షులు గువ్వల శ్రీనివాస రెడ్డి, లతీఫ్ (బచ్చా), మండల నాయకులు సంగు కొండా రెడ్డి, నారాయణ రెడ్డి, యానం గోపికృష్ణ కార్యకర్తలు పాల్గొన్నారు.
