ఒంగోలుపార్లమెంట్ టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి మానం రమేష్ బాబు సతీమణి మానం సుబ్బారత్తమ్మ
(54) మంగళవారం మృతి చెందారు. ఆమె ఇటీవల కాన్సర్ వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్ లోని బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళ వారం మద్యాహ్నం మృతిచెందారు. ఆమె మండల టీడీపీ సీనియర్ నాయకులు నవులూరి సురేంద్రమోహన్ కు స్వయానా చెల్లెలు. టీడీపీ రాజకీయాల్లో రమేష్ క్రియాశీలకంగా ఉండడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు వారి ఇంటికి అధిక సంఖ్యలో వెళుతుంటారు. ఇంటికి వచ్చి వెళ్లేవారిపట్ల రమేష్ సతీమణి సుబ్బారత్తమ్మ ఎంతో ఆప్యాయంగా పలుక రిస్తూ కాఫీ త్రాగంది పంపేది కాదు. ప్రత్యక్ష క్రీయాశీల రాజకీయాల్లో లేకున్నా భర్తకు అండగా వుండి పార్టీ శ్రేణుల అభిమాన్ని పొందారు. ఆమె మృతిని పార్టీ శ్రేణులుజీర్ణించుకోలేక పోతున్నారు. ఆమెమృతి పట్ల దర్శినియోజకవర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, మండల టీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి, మాజీటీడీపీ అధ్యక్షులు బి.ఓబుల్ రెడ్డి మన్నేపల్లి,నాగంబొట్లపాలెం సొసైటీ అధ్యక్షులు గొందిరమణారెడ్డి (సమర) వల్లభనేని సుబ్బయ్య, టీడీపీ నాయకులు శాగంకొండారెడ్డి, శివనాగిరెడ్డి , గొల్లపూడి వేణుబాబు,ఇడమకంటి.శ్రీనివాసరెడ్డి, రాచకొండవెంకట్రావు, కె.రామకోటి రెడ్డి,, షేక్ ఖాసిం సైదా , మీరామొహిద్దీన్, చెన్నపురెడ్డి వీరనాగిరెడ్డి, ఇడమకంటి.శ్రీనివాసరెడ్డి, కె.రామకోటి రెడి. పిన్నికరమేష్, జి.లక్ష్మీనారాయణ, అనపర్తిసుబ్బారావు, కె.రామయ్య,
వంగపల్లినాగేశ్వరరావు, ఎఫ్రయిమ్, బద్దులశ్రీను,ఢానీ, రామలక్షయ్యలు తీవ్ర విచారం వ్యక్తం చేసి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు.
