స్వామిత్వ సర్వేను సచివాలయ సిబ్బంది వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీడీవో సానికొమ్ము సత్యం తెలిపారు. మండలంలోని తూర్పుగంగవరం, మన్నేపల్లి, మాధవరం, తాళ్లూరు సచివాలయాలను మంగళవారం తనిఖీచేశారు. ఈసందర్భంగా ఆయా సచివాలయాల సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రభుత్వ పలు సర్వేలను చేపట్టిందని, సర్వేచేయాల్సినసచివాలయ ఉద్యోగులు అలసత్వం వహిస్తున్నందున సకాలంలో సర్వేలు పూర్తికాక తాళ్లూరు మండలం జిల్లాలో వెనుకంజలో వుందన్నారు. సచివాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, సర్వేలు నిర్వహించటంలో నిర్వక్ష్యం వహిస్తే శాఖాపరచర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు. ప్రభుత్వం యాప్ ద్వారా సమాచారాన్ని పంపుతున్నందున వాటిని పరిశీలించి సర్వేలను త్వరిగతిన పూర్తి చేయాలన్నారు. ఆయా సచివాలయాల్లో రికార్డులను పరిశీలించారు.
సచివాలయ సిబ్బంది బాధ్యతా యుతంగా విధులు నిర్వహించాలని, సర్వేలు నిర్వ హించటంలో నిర్యక్ష్యం వహిస్తే శాఖాపరచర్యలు తీసుకోవటం జరుగుతుందన్నారు.
ఆయా సచివాలయాల పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
