వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నందు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ మరియు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ … వినాయక చవితి అనేది కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జరుపుకునే పండుగ అని తెలిపారు. విఘ్నేశ్వరుడు ప్రతి ఒక్కరికీ క్షేమం, ధైర్యం, ఆయురారోగ్యాలు, సకల సంపదలు ప్రసాదించాలని, చేపట్టిన పనుల్లో ఎలాంటి విఘ్నాలు లేకుండా సజావుగా జరగాలన్నారు. ప్రజలందరూ భక్తిభావం, సామరస్యం, ఐకమత్యం, ఆనందోత్సాహాల మధ్య ఈ పండుగను, గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని సూచించారు. పండుగ రోజు నుంచి నిమజ్జనం వరకు జరిగే పూజలు, వేడుకలు, ఊరేగింపుల సందర్భాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో వినాయక మండప నిర్వాహకులు పోలీసు శాఖ ఇచ్చే సలహాలు, సూచనలు పాటించి, గణేష్ ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. అలాగే ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తినట్లయితే వెంటనే సంబంధిత స్థానిక పోలీసు అధికారులకు లేదా డయల్ 112/100 నంబర్లకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.”
ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ కె.శ్రీనివాసరావు, ఎస్ బి ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండురంగారావు,ఆర్ఐలు రమణ రెడ్డి,సీతారామరెడ్డి, ఆర్ఎస్సైలు ప్రసాద్, రవి, పాపిరెడ్డి, తిరుపతి స్వామి మరియు సిబ్బంది పాల్గొన్నారు.




