హిందూ ముస్లిం ఐక్యతకు నిలువెత్తు సాక్ష్యం గా నిలుస్తుంది గణేశుని విగ్రహం. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్ధికూరపాడు గ్రామంలోని బీసీ కాలనీలో యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. గత 15 సంవత్సరాలుగా ఈ కాలనీలో నివసించే హిందువులు, ముస్లింలు అందరూ కుల మతాలకు అతీతంగా విగ్నేశ్వరుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పూజ దగ్గర నుంచి నిమజ్జనం వరకు అందరూ కలిసికట్టుగా ఉండి విఘ్నేశ్వర ఉత్సవాలు జరుపుకుంటారు. కాలనీలోని హిందూ ముస్లిం యువతీ యువకుల ఐక్యతను చూసి ప్రజలందరూ ఉత్సవాలు జరుపుకుంటే గ్రామాల్లో అన్నదమ్ముల వాతావరణం నెలకొని సోదరుభావానికి సాక్ష్యంగా నిలుస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
