ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా దృష్టి సారించడంతో పాటు, బాధితులకు తక్షణమే పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి
అధికారులను ఆదేశించారు.
సోమవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్ లో జరిగిన డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, సంతనూతలపాడు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, కందుల నారాయణ రెడ్డి, ముత్తుముల అశోక్ రెడ్డి, డా. ముక్కు ఉగ్రనరసింహ రెడ్డి, బిఎన్ విజయకుమార్, జిల్లా ఎస్.పి ఎ ఆర్ దామోదర్, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో కలసి పాల్గొని జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి బాధితులకు మంజూరు చేయాల్సిన కాంపెన్సేషన్, భూ పరిహారం, ఉద్యోగ నియామకాలు తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి డా. డోలా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ… ఎస్.సి., ఎస్.టిల అభివృద్ధి, సంక్షేమంతో పాటు వారి సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరం పరిష్కారం అయ్యేలా దృష్టి సారించడంతో పాటు, బాధితులకు తక్షణమే పరిహారం ఇచ్చేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాధిత కుటుంబాలకు భూ పరిహారం, కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి, రెవిన్యూ అధికారులను ఆదేశించారు. 2023 నుండి నమోదైన కేసుల వారీగా మంత్రి సమీక్షిస్తూ, బాధితులకు న్యాయం చేయడంలో ఎక్కడా రాజీ పడరాదన్నారు. విచారణ, పోలీసుల దర్యాప్తులో వేగం పెంచాలని న్యాయబద్ధంగా పరిష్కార మార్గం చూపాలన్నారు. ప్రజలకు పూర్తీ స్థాయిలో అవగాహన కల్పించేలా క్షేత్ర స్థాయిలో పౌరహక్కుల దినోత్సవాన్ని విస్తృతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఎస్.సి., ఎస్.టి గ్రామాల్లో స్మశాన వాటిక ఏర్పాటు మరియు స్మశాన వాటికల ఆధునీకరణకు అవసరమైన మేరకు ప్రతిపాదనలు పంపాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి కేసుల ఫైలింగ్, ఏ దశలో ఉన్నాయి, నష్టపరిహారం చెల్లింపు తదితర వివరాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పోలీసు అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. జిల్లాలో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి బాధితులకు సకాలంలో పరిహారం చెల్లించినప్పుడే వారికి న్యాయం చేకూర్చినట్లు అవుతుందని , అందుకు రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కమిటీ సభ్యులు సమావేశంలో ప్రస్తావించిన అంశాలను ప్రత్యేక దృష్టి సారించి సత్వరం పరిష్కరించేలా అధికారులు శ్రద్ద చూపాలన్నారు.
జిల్లా ఎస్.పి ఎ.ఆర్ దామోదర్ మాట్లాడుతూ…. బాధిత కుటుంబాలకు మేలు జరిగేలా దర్యాప్తులో జాప్యం లేకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లింపులలో ఆలసత్వం ఉండకుండా పోలీసు శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందన్నారు.
కమిటీ అనధికార సభ్యులు పల్లె మనీందర్ దేవ్, మొలతోటి గురవయ్య, పోన్నర్సు సునీత, యనమద్ని వెంకటేశ్వర్లు, కత్తి అన్నోజీ రావు, షేక్ వలీ సాహెబ్, గంగవరపు సాంసందీర్, అచ్చిబిగారి షేక్ మొహమ్మద్ ఖాశీం తదితరులు మాట్లాడుతూ… ఎస్.సి., ఎస్.టి సబ్ ప్లాన్ కచ్చితంగా అన్నీ శాఖల్లో అమలు చేయడంతో పాటు ఎస్.సి., ఎస్.టి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, అలాగే అవసరమైన గ్రామాల్లో స్మశాన వాటికల ఏర్పాటు మరియు ఎర్రగొండపాలెం పరిధిలో కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం జన్ మన్ పధకం కింద మంజూరు చేసిన ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వమే నిర్మింఛి ఇవ్వడం గానీ లేదా యూనిట్ కాస్ట్ పెంచడం చేయాలని కమిటీ దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే కమిటీ సభ్యులు పలు సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించాలని కోరారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, మార్కాపురం సబ్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్, జిల్లా రెవిన్యూ అధికారి చిన ఓబులేసు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు లక్ష్మా నాయక్, జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి, డిఆర్డిఎ పిడి నారాయణ, డిటిడబ్ల్యూఓ వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.





