ప్రకాశం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ప్రజా ఫిర్యాదులను పరిష్కారించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నాలుగు దిక్కుల నుండి వచ్చిన ఫిర్యాదారులు జిల్లా ఎస్పీ కి మరియు పోలీస్ అధికారులకు విన్నవించుకున్నారు. జిల్లా ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి వారి సమస్యల పూర్వాపరాలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు జిల్లా ఎస్పీ తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యలపై వెంటనే విచారణ చేపట్టి, చట్ట ప్రకారం విచారణ జరిపి భాదితులకు సత్వరం న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎక్కువ భూ వివాదాలు, కుటుంబ కలహాలు, భర్త/అత్తారింటి వేధింపులు, చీటింగ్/జాబ్ ఫ్రాడ్ మరియు ఇతర సమస్యల గురించి ప్రజా పిర్యాదులు వచ్చాయి.
*ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని….*
చీటి పాట పేరుతో తన వద్ద నుండి గుండాయపాలెంకు చెందిన ఒక మహిళా మరియు మరొకరు లక్ష రూపాయల గల ఒక చీటి కట్టించుకొని చివరకు డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని, తాను చెల్లించిన డబ్బులు అడుగుతుంటే ఇవ్వడంలేదని ఒంగోలు మండలం, గుండాయపాలెంకు చెందిన వ్యక్తి పిర్యాదు.
ఒంగోలులోని ఓ ఆటో ఫైనాన్స్ ద్వారా హోండా షైన్ మోటార్‌సైకిల్‌ను రూ.75,000కి కొనుగోలు చేసి, ముందుగా రూ.40,000 అడ్వాన్స్‌గా చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని ఈఎంఐ ల రూపంలో చెల్లించినప్పటికీ, వారు తమకు బయోమెట్రిక్ వేయించకుండా, ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వెంకటేశ్వర కాలనీకి చెందిన వ్యక్తి ఫిర్యాదు.
ఒంగోలు, గాంధీ రోడ్డులో ఉన్న బంగారం షాపులో కొత్త బంగారం వస్తువుల కొరకు రూ.3 లక్షలు నగదు చెల్లించగా, పాత చైన్ తీసుకొని కొత్త చైన్ తయారు చేసి ఇస్తానని చెప్పి బంగారం తీసుకున్నట్టు తెలిపారు. కానీ కొంతకాలంగా బంగారం ఇవ్వకుండా ఇబ్బంది పేటుతున్నారని ఇందిరమ్మ కాలనీకి చెందిన మహిళ ఫిర్యాదు
ఈ కార్యక్రమంలో మహిళ పోలీస్ స్టేషన్ డిఎస్పీ రమణ కుమార్, ఎస్సీ/ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గ ప్రసాద్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ జగదీష్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాండు రంగారావు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
