ఎన్ టి ఆర్ సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంపీడీఓ సానికొమ్ము సత్యం హెచ్చరించారు. మండలంలోని మాధవరం, విఠలాపురం, తూర్పుగంగవరం, మున్నేపల్లి పంచాయితీలలో పెన్షన్ల పంపిణీని ఆయన సోమవారం పరిశీలించారు. తూర్పుగంగవరంలో పెన్షన్ల పంపిణీ సమయంలో సిబ్బంది అందుబాటులో లేక పోవటం, బయట ఉన్నానని సమాధానం చెప్పటంతో ఎంపీడీఓ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రాధాన్యత క్రమంలో ప్రతి నెల మొదటి తెదీన ప్రభుత్వం పెన్షన్లు అందజేయ్యాలన్న ఆదేశాలు ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. మరోక సారి ఇలాగే జరిగితే కఠిన చర్యలు తప్పవని అన్నారు. శివరామపురంలో మరోక మహిళ పెన్సన్ నాలుగు నెలలుగా ఇవ్వక పోవటంతో బి యాండ్ ఎల్ ఎ ఏలో పడి పోవటంతో ఆమె గత నాలుగు నెలల క్రితం ఒంగోలు స్పందనకు వెళ్లనది అయినా నరే ఆమె సమస్య తీరలేదు. దీనిపై ఎంపీడీఓ వివరణ కోరారు. మండలంలో మొత్తం పలు రకాల పెన్షన్లు 6174 ఉండగా 5579 మందికి 2.42 కోట్లు మేర 90.02శాతం పంపిణీ చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు.
