తహసీల్దార్ మారినప్పుడల్లా ఉమ్మడి బీడు అన్లైన్ కు దరఖాస్తు- జాగ్రత్త వహించాలని తహసీల్దార్ కి వినతి

తహసీల్దార్ మారినప్పుడల్లా సోమవరప్పాడు సర్వే నంబర్ 229/2 లో ఉమ్మడి బీడు విషయంలో ఒక కుటుంబానికి చెందిన వారు తమకి ఆన్లైన్ చెయ్యాలంటూ దరఖాస్తు చేసుకుంటున్నారని జాగ్రత్త వహించాని తహసీల్దార్ బివి రమణా రావును నాగంబొట్ల పాలెం సొసైటీ చైర్మన్ వల్లభనేని నుబ్బయ్య కోరారు. తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో పాల్గొని వినతి పత్రం అందించారు. అదే విధంగా ఎకలవ్య నగర్ కి చెందిన ఎస్టీలకు తాము దశాబ్ధాలుగా సాగు చేసుకుంటున్న సాగు భూమికి పట్టాలు ఇవ్వాలని విన్నవించారు. మాధవరంకు చెందిన రైతు రీ సర్వేలో తమ పొలం విస్తీర్ణం తగ్గిందని తగిన న్యాయం చెయ్యాలని కోరారు. పట్టాదారు పాస్ పుస్తకాల నిమిత్తం మరో రెండు దరఖాస్తులు అందినట్లు తహసీల్దార్ చెప్పారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *