అర్జీల పరిష్కారంపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రీఓపెన్ కాకుండా అర్జీలను సకాలంలో పరిష్కారించాలి – జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీల పరిష్కారంపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రీఓపెన్ కాకుండా అర్జీలను సకాలంలో, గడువులోగా నాణ్యతతో పరిష్కారించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా,
అధికారులను ఆదేశించారు.
సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, వరకుమార్, కుమార్, జాన్సన్ లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…. ఆర్జీల పరిష్కారంలో అలసత్వం లేకుండా సకాలంలో పరిష్కరించేలా అధికారులు శ్రద్ద చూపాలన్నారు. పిజిఆర్ఎస్ లో వచ్చిన అర్జీల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. పిజిఆర్ఎస్ లో వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. పరిష్కారంలో భాగంగా సరైన ఎండార్స్మెంట్ ఇచ్చారా లేదా ఆడిట్ టీం పరిశీలన చేయడం జరుగుతుందన్నారు. పిజిఆర్ఎస్ లో వచ్చే అర్జీల పరిష్కారం పై ఐవిఆర్ఎస్ ద్వారా సంబంధిత అర్జీదారుల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలు సేకరిస్తున్నందున అర్జీదారులతో అధికారులు మర్యాదపూర్వకంగా మాట్లాడాలని కలెక్టర్ సూచించారు. రీఓపెన్ కాకుండా అర్జీలను సకాలంలో, గడువులోగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రతి శాఖలో ఆడిట్ టీమ్ లతో పాటు నోడల్ అధికారిని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆడిట్ లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను ఈపిటిఎస్ వెబ్ సైట్ లో ప్రతి రోజు అప్ లోడ్ చేయాలని, ఈ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *