2025-26 పంట కాలానికి పొగాకు నారు మడి సాగు చేయు రైతులు తప్పనిసరిగా ఒంగోలు-2 పొగాకు బోర్డు పరిధిలోని వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని బోర్డు వేలం నిర్వాహణాధికారి జె తులిసి కోరారు. గరిష్టంగా ప్రతి రైతు రంబఎడు హెక్టార్ల విస్తీర్ణం వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు. నారు మడి ఉత్పత్తి దారునిగా రిజిస్ట్రేషన్ పొందిన వారు తమ వివరాలు అన్ని తెలియపరుస్తూ నారు మడి వేసిన పొలంలో బోర్డు అమర్చాలని తెలిపారు. బోర్డులో రిజిస్ట్రేషన్ అయిన వారు మాత్రమే నారు విక్రయించాలని చెప్పారు. బోర్డు సంబంధిత రసీదు పుస్తకాలను ఇస్తుందని తెలిపారు. పొగాకు సాగు చేసే రైతులు ఫారం-2తో పాటు నారు కొనుగోలు చేసిన రసీదును జత పరచి బోర్డులో అందజేయ్యాలని చెప్పారు. స్వతంగా నారు పెంచ దలచిన రైతులు బోర్డులో వివరాలు అందజెయ్యాలని తెలిపారు. బోర్డు సూచించిన మేరకు పొగాగు సాగు చెయ్యాలని కోరారు. అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా పొగాకు ఉత్పత్తిని నియంత్రించుకుని ప్రత్యామ్నాయం పంటల వైపు దృష్టి సారించాలని నూచించారు.
