బేగంపేట సెప్టెంబర్ 2(జే ఎస్ డి ఎం న్యూస్)
ఖైరతాబాద్ విశ్వశాంతి మహాగణపతిని మంగళవారం సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విశాల్ సుధాములు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వినాయకుడు మూడు తలలు ఎనిమిది చేతులు ఐదు సర్పపు పడగలతో నిర్మించారని ఇది దైవత్వం మరియు పర్యవరణ స్పృహతో ఉందని వారు అన్నారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ డాక్టర్ కోట నీలిమ ,విశాల్ సుదాం లను శాలువాలతో ఘనంగా సత్కరించారు.వారి వెంట చిరంజీవి, పి ఎల్ కృష్ణ అఖిల్ షాబాద్ మోహిత్ బీసా తదితరులున్నారు.


