పాడి పరిశ్రమపై ప్రత్యేక శ్రర్థ తీసుకోవాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. మండలంలోని విఠలాపురం, మాధవరం గ్రామాలలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయాధికారి, విఏ లు కలిసి పలు పశువుల షేడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పరిశ్రమ రైతులకు రెండు కళ్లు వంటి వని అన్నారు. మండలంలో 80వేల లీటర్ల పాల ఉత్పత్తి సామర్ధ్యం ఉందని అన్నారు. 12,256 ఎకరాలలో పశు గ్రాసం సాగవుతుందని చెప్పారు. పశుపోషణ పట్ల ప్రత్యేక శ్రర్థ తీసుకోవాలని టీకాలు ఎప్పటికప్పుడు వేయించుకోవాలని విఏఏ బి రాధ క్రిష్ట కోరారు. విఏఏ లు అజ్మీర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
