హైదరాబాద్ సెప్టెంబర్ (జే ఎస్ డి ఎం న్యూస్) :
విఘ్నాలు తొలగించి ప్రజలందరినీ చల్లగా చూడు విఘ్నేశ్వర అంటూ భక్తులు గణనాథుని వేడుకున్నారు.సూరారం ఎక్స్ రోడ్ జై శంకర్ నగర్ కాలనీలో జై భవానీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజలలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్న దానం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.మహిళా ముత్తైదువులకు తాంబూలం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు మల్లేశ్ యాదవ్,కవిత,ప్రశాంత్,ఆకుల సత్యనారాయణ,కాలేష్, కృష్ణా,బిక్షపతి, దేవి,నాగరాణి తదితరులు మాట్లాడుతూ తమ కాలనీలో 20ఏళ్లుగా గణనాథుని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు.విఘ్నేశ్వరుని ఆశీస్సులు భక్తులు,కాలనీ వాసులపైన ఉండాలని స్వామిని వేడుకున్నామన్నారు,ప్రతి ఏటా స్వామి అనుగ్రహంతో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.ప్రతి ఏటా కమిటీకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలు, భక్తులకు కమిటీ సభ్యులు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.




