గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు, స్పెషల్ పార్టీ, ఈగిల్ టీం, ఆర్పీఎఫ్ , జీఆర్‌పీ సిబ్బంది, మరియు మాదకద్రవ్యాలను గుర్తించే డాగ్ స్క్వాడ్ తో కలిసి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ కేంద్రాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన పార్సిళ్లు, ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులు మరియు ఇతర వస్తువులను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు.
పూరి నుండి తిరుపతి ఎక్స్ప్రెస్ లో ప్రకాశం జిల్లా పోలీస్ లు తనిఖీలు చేపట్టగా ఒంగోలు నుండి సింగరాయకొండ మధ్యలో 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని, ఇద్దరు వ్యక్తులు ప్రేమ్‌చంద్, (వడపళని, చెన్నై), మనీష్, (సౌకార్‌పేట్, చెన్నై )అదుపులోకి తీసుకున్నారు. అదే ట్రైన్ లో మరొక బోగీలో 11 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు అనుమానితుల వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం జి ఆర్ పి పోలీసులకు అప్పగించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను రవాణా చేసే, విక్రయించే, వినియోగించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు హెచ్చరించారు. గంజాయి మరియు మాదకద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266 కు తెలియజేయవచ్చుని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు తెలియజేశారు.
ఈ తనిఖీలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్, ఎస్సైలు శ్రీకాంత్, ఆంజనేయులు,చెంచయ్య, ఆర్పీఎఫ్, జీఆర్‌పీ ఎస్సై మధుసూదన్ రావు, అధికారులు, ఈగిల్ టీం మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ తనిఖీలలో గంజాయిని పట్టుకున్న పోలీస్ అధికారులు మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.


