తాళ్లూరుమండలంలోని తాళ్లూరు, కొత్త పాలెం, బొద్దికూరపాడు రామాలయం సెంటర్, తూర్పు గంగవరం లలో కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహాలతో పాటు పలు గ్రామాలలో స్వామి వారిని నిమర్జనానికి ఘనంగా తరలించారు. మేళ తాళాలతో డీజే బాక్సులు ఏర్పాటు చేసి గ్రామోత్సవాలు నిర్వహించి కుంకుమ చల్లుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కు అంటూ ఘన వీడ్కోలు పలికారు.
