సెప్టెంబర్ నెల 8వ తేదీన కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ..ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి…. జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా.


సెప్టెంబర్ నెల 8 వ తేదీన సోమవారం జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్  ఏ తమీమ్ అన్సారియా ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్  మందిరంలో  ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పి. జి. ఆర్. ఎస్)” అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు   మండల,డివిజనల్  స్థాయిలో  కూడా నిర్వహిస్తామని  కలెక్టర్ అన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి
*Meekosam.ap.gov.in*
(మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చునని, అలాగే వారి యొక్క అర్జీల  నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుసుకోవాలి అన్నప్పుడు *1100* (డబల్ వన్ డబల్ జీరో) కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *