హిందువులంతా బంధువులుగా ఐకమ త్యంగా ముందుకు సాగి హిందూ సమాజాన్ని కాపాడుకోవాలని విశ్వహిందూపరిషత్ స్వచ్చంద ప్రముఖ్ సుబ్బారావు తెలి పారు. తాళ్లూరులోని కన్యకా పరమేశ్వరి ఆలయ ఆవరణలో విశ్వహిందూపరిషత్ ఒంగోలు జిల్లాస్థాయి విస్తృతస్థాయి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా సుబ్బారావు మాట్లాడుతూ….సమాజంలో జీహాదీల పేరుతో మోసాలకు ఓవర్గం తెరలేపుతున్నందున హిందూసమాజం అప్రమత్తంగా వుండాలన్నారు. హిందూ సంప్రదాయాలను దూరం చేసే రీతిగా తల్లిదండ్రులను కుటుంబసభ్యులను వ్యతిరే కించే కోణలో సినిమాలు తీస్తున్నారని జాగ్రత్త వహించాలన్నారు. హిందూ స మాజం పిల్లలకు సంపూర్ణ హక్కులు ఇస్తున్నందున స్వేచ్ఛ పేరుతో కొందరు చెడు మార్గంలో పయనిస్తున్నారని, కొన్ని మతాలకు చెందిన వారు సంప్రదాయాల
పేరిట తమ పిల్లలను బయటకు పంపకుండా సన్మార్గంలో వుండేందుకు యత్నిస్తున్న విషయాలను హిందూ సమాజం గమణించాలన్నారు. ధర్మబంధాలు దూమైతే ప్రజల్లో అజ్ఞానం పెరిగి సమాజం నష్టపోతుందన్నారు. హిందూదేశాన్ని ఇతర మత
స్తులే పరిపాలించారని, వారిపాలనలో హిందూ మత ప్రజలు దెబ్బతిన్నారే తప్ప లాభపడింది లేదన్నారు. భారతదేశంలోగత14 ఏళ్ల పాలనలో మాత్రమే కొంతమార్పు వచ్చిందన్నారు. హిందూ ధర్మాన్ని గురించి ప్రచార్లు గ్రామాల్లో ప్రజల్లో అవగా హన కల్గించి సనాతన ధర్మాన్ని కాపాడాలని తెలిపారు. ముందుగా గ్రామంలో శ్రీరామస్వామి నినాదాలతో భారీ ర్యాలీ జరిపారు. ఈ
కార్యక్రమంలోవిశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖు చందోలు రామారావు, శ్రీనివాసనందస్వామి , శివశంకర్, చందోలు శివ, రాధాకృష్ణ, బ్రహ్మానందరెడ్డి, బి.శ్రీనివాసులు, బలరామ్, నగేష్ బాబు, సాంబిరెడ్డి, పెరుమాళ్, తాళ్లూరు, ముండ్లమూరు మండలాల విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ లు, మహిళా ప్రచార ప్రముఖ్ లు తదితరుల పాల్గొన్నారు.

