ప్రకాశం జిల్లాలోనే తాళ్లూరు, ముండ్లమూరు, దర్శి మండలాలను కొనసాగించాలని కాంగ్రెన్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం తాళ్లూరు మండలంలో సంతకాల సేకరణ చేయనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అసంఘటిత కార్మికుల, ఉద్యోగుల చైర్మన్, దర్శి నియోజక వర్గ సమన్వయ కర్త కైపు వెంకట క్రిష్ణా రెడ్డి తెలిపారు. తాళ్లూరు నుండి మార్కాపురంకు 92 కి.మీల దూరం ఉండగా, ఒంగోలు కేవలం 35 కి.మీల మేర మాత్రమే ఉన్నదని ఇటువంటి అనేక కారణాలను వివరించారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు విద్య, ఉద్యోగ, కార్మిక, కర్షక సోదరులు సహకరించాలని కోరారు.
