ఆర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి -జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా

ప్రజా సమస్యల పరిష్కార వేదిక”లో వచ్చే ఆర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రీఓపెన్ కాకుండా అర్జీలను సకాలంలో, గడువులోగా నాణ్యతతో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, అధికారులను ఆదేశించారు.
సోమవారం ఒంగోలు కలెక్టరేట్ లోని మీ కోసం సమావేశ మందిరంలో నిర్వహించిన “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాల క్రిష్ణ, జిల్లా రెవెన్యు అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్ రెడ్డి, వరకుమార్, కుమార్, విజయజ్యోతి లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ద చూపాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పిజిఆర్ఎస్ లో వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. ప్రతి రోజు లాగిన్ అయి అధికారులు వినతులను చూడాలని, అలాగే రీ ఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. గడువు లోపలే వినతులకు సమాధానాలు పంపాలన్నారు. రీఓపెన్ కాకుండా అర్జీలను సకాలంలో, గడువులోగా నాణ్యతగా పరిష్కరించాలన్నారు. పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రతి శాఖలో ఆడిట్ టీమ్ లతో పాటు నోడల్ అధికారిని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆడిట్ లో పెండింగ్ లేకుండా చూడాలన్నారు. కొన్ని శాఖల అధికారులు ఆయా శాఖలకు సంబంధించి నోడల్ అధికారుల వివరాలను ఇప్పటి వరకు పంపలేదని, తక్షణమే వివరాలు పంపాలని జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్నీ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను ఈపిటిఎస్ వెబ్ సైట్ లో ప్రతి రోజు అప్ లోడ్ చేయాలని, ఈ ప్రక్రియపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *