యూరియా అధిక వినియోగంపై వ్యవసాయాధికారి ప్రసాద రావు మండల స్థాయి
అధికారులతో కలిసి మంగళవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాధవరంలో ఎంపీడీఓ సానికొమ్ము నత్యంతో కలసి నచివాలయం ఆవరణలో రైతులకు భూ సార యాజమాన్యంపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో తహసీల్దార్ బి వి రమణా రావు ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి అధిక యూరియా వినియోగంతో భూమి నిస్సారమవుతుందని చెప్పారు. రైతులు అవగాహన కలిగి తక్కువ ఖర్చుతో భూసార యాజమాన్యాన్ని పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని వివరించారు. రైతులతో ప్రతిజ్ఞ చేయించారు. ఆయా కార్యక్రమాలలో మాధవరం పంచాయితీ కార్యదర్శి ఎ వెంకటేశ్వర్లు, తహీసీల్దార్ కార్యాలయ సిబ్బంది, విఏఏలు షేక్ అజ్మీర్ తదితరులు పాల్గొన్నారు.

