లతా పేష్కర్ రచనలు స్పూర్తి దాయకం…రచయిత లతా పేష్కర్ ను సత్కరించిన ట్రస్మా.

లతా పేస్కర్ రచనలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ట్రెస్మా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉమామహేశ్వరరావు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ప్రముఖ రచయిత్రి లతా పేష్కర్ ను ట్రెస్మా ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ లతా పేస్కర్ రచించిన పలు రచనలు నేటితరం యువతరానికి పూర్తి కానున్నాయన్నారు.అవి వారిని ఎంతో చైతన్యం చేసేలా ఉన్నాయన్నారు. ఆమె రచించిన హిబ్బిస్కస్ హాట్, ది మిస్టీరియస్ టేల్స్ ఆఫ్ మహారాజపురం, మిట్టు మిస్ క టిట్స్, హరి నారాయణ స్ట్రీట్, మై మామ్ ఇస్ మై ఫేవరెట్ హీరో వంటి అద్భుతమైన పుస్తకాలను ఆమె రచించారని, అవి ఎంతో ప్రభావితం చేస్తాయన్నారు. ఆలాంటి రచయితను సన్మానించుకోవడం తమకెంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెస్మా సభ్యులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *