రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వం – అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్. మాజీ ఎమ్మెల్యే శీలం రామదాసు మనుమడు శీలం అనురాగ్ బిఆర్ఎస్ లో చేరిక – బిఆర్ఎస్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురి చేరిక.

బేగంపేట సెప్టెంబర్ 10,(జే ఎస్ డి ఎం న్యూస్) :
రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమని రాంగోపాల్ పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ అతెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం రాంగోపాల్ పేట్ డివిజన్‌లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, హుడా మాజీ చైర్మన్ దివంగత శీలం రాందాస్ మనుమడు, మాజీ కార్పొరేటర్ దివంగత శీలం ప్రభాకర్ కుమారుడు శీలం అనురాగ్ తన అనుచరులతో కలిసి అరుణ గౌడ్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు తలసాని స్కేలాబ్ యాదవ్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అరుణ గౌడ్ మాట్లాడుతూ…. యువ నాయకులకు ఎప్పుడు ముందు చూపు ఉండాలనీ, రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ పార్టీదే అధికారమని ఆది గుర్తించి సముద్రంలాంటి బిఆర్ఎస్ లో చేరిన యువ నాయకులకు అభినందనలన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ఎగరబోయేది బిఆర్ఎస్ జండానే అని, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ననే ఎమ్మెల్యే నే అన్నారు. అలాగే ఈ వేదిక మీద నుండి చెపుతున్న రామ్ గోపాల్ పేట్ డివిజన్ లో మళ్ళీ బిఆర్ఎస్ కార్పొరేటరే రానున్నరని పేర్కొన్నారు. కష్టపడి పని చేసే వారికి బిఆర్ఎస్ పార్టీలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. అన్నా నేను కష్టంలో ఉన్నాను అంటే మొట్టమొదటగా వచ్చేది అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రమే నని గుర్తు చేశారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి అయినా జరిగింది అంటే అది శీనన్న పుణ్యమేనని కాంగ్రెస్ పార్టీ వారు బిజెపి పార్టీ వారు చేసింది ఏమీ లేదని వారు వచ్చి శిలాఫలకాలముందు ఫోటోలు దిగడం మాత్రమే చేస్తారని ఎద్దేవా చేశారు. అందరం కలిసి కష్టపడి రాష్ట్రంలో తిరిగి తెలంగాణ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపి పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి వలసలు ఉంటాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం యువ నాయకుడు శీలం అనురాగ్ మాట్లాడుతూ…. మా తాత మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ శీలం రామ్ దాస్, మా తండ్రి మాజీ కార్పొరేటర్ దివంగత శీలం ప్రభాకర్ రాజకీయ వారసునిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ లు చేసిన అభివృద్ధిని చూసి వారిపై నమ్మకంతో, కార్యకర్తగా బిఆర్ఎస్ పార్టీలో చేరానని పార్టీ తనకు ఎటువంటి బాధ్యతలు అప్పగించిన నమ్మకంగా ఆ బాధ్యతలను నెరవేరుస్తానని అన్నారు.
శీలం అనురాగ్ తో పాటు శీలం రతుల్ , శీలం రిత్విక్ , లకన్, కేశవ్ అగర్వాల్, ప్రతీక్, రాహుల్ మెహతా, రెహ్మాన్, ముస్తాఫా, ఆదేశ్ లతో పాటు పలువురు బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని ఆ పార్టీలో చేరారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాంగోపాల్ పేట్ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షులు అతెల్లి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి వంజరపు ఆంజనేయులు, నాయకులు ఆకుల హరి, లక్ష్మీపతి, నాగులు, శ్రీ ఉజ్జయిని మహాకాళి దేవాలయ మాజీ ధర్మకర్తలు ఆనంద్ పాటిల్, మహేష్ యాదవ్,రామ మోహన్ యాదవ్, చంద్ర ప్రకాష్, మహేందర్, శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం మాజీ ధర్మకర్త ప్రతిపాక సంజయ్, శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం మాజీ ధర్మకర్తలు పండుగ శ్రీనివాస్ దర్శనం శివకుమార్ లతోపాటు పలువురు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *