వైసీపీ యూరియాపై లేని పోని ఆందోళన ప్రకటనలు చేస్తూ యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తూ వైసీపీ నేతలు రైతులను ఆందోళన చెందే విధంగా ప్రకనలు గుప్తిస్తున్నారని తాళ్లూరు మండల తెలుగు దేశం పార్టీ నాయకులు ఆరోపించారు. స్థానిక ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు ఛాంబర్లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ యూరియా కావలసిన మేర మండలంలో స్టాకు ఉన్నదని చెప్పారు. టిడిపి నియోజక వర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్లు వ్యవసాయాధికారులతో మాట్లాడుతూ రైతులకు ఎప్పటికప్పుడు యూరియా అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకున్నారని అన్నారు. టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్ది, నాటక కార్పోరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బి ఓబులు రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి రాచకొండ వెంకట రావు, మన్నేపల్లి సొసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి (నమర)లు మాట్లాడుతూ దుకాణాలలో, ఆర్ బి కేలలో, సొసైటీలలో సైతం యూరియా ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని కావలసిన రైతులు సంప్రదించాలని సూచించారు. వైసీపీ నేతలు రైతులను ఆందోళనలకు గురిచేసే ప్రకటనలు మానుకోవాలని హితవు చెప్పారు.
