ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో పోలీసులు, స్పెషల్ పార్టీ, ఈగిల్ టీమ్, సిబ్బంది మరియు మాదకద్రవ్యాలను గుర్తించే డాగ్ స్క్వాడ్ రాక్సీతో కలిసి పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల బోగీలు, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు, పార్సెల్ కేంద్రాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు. అనుమానాస్పదంగా కనిపించిన పార్సెల్స్, ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులు మరియు ఇతర వస్తువులను ఒక్కొక్కటిగా తనిఖీ చేశారు.
ప్రత్యేకంగా, ఈ తనిఖీలో రాక్సీ అనే బెల్జియం మాలినోయిస్ జాతి డాగ్ జాగిలం కీలక పాత్ర పోషించింది.19 తేదీ రాత్రి హౌరా నుంచి బెంగళూరు ఎక్స్ప్రెస్ లోని తనిఖీలలో, రాక్సీ తన వాసన శక్తి ద్వారా గుర్తించి అబ్దుల్ హుదుద్ (25 సంవత్సరాలు, ముస్లిం, హౌరా, పశ్చిమ బెంగాల్) వద్ద 40 గ్రాముల చిన్న ప్యాకెట్లు 38 మొత్తంగా 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
రాక్సీ జాగిలం ముఖ్యంగా వాహనాలు, బస్సులు, రైళ్లు, లారీలలో దాచిన మత్తు పదార్థాలను గుర్తించడంలో అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోంది. ఈ విధమైన శిక్షణలతో, రాక్సీ మాదకద్రవ్యాల రవాణాను ఎక్కడ దాచినా, ఎంత చిన్న పరిమాణంలోనైనా గుర్తించగలదు. రాక్సీ వంటి శిక్షణ పొందిన జాగిలం పోలీస్ శాఖకు మత్తు పదార్థాల గుర్తింపు మరియు నేరస్తులపై దృష్టి పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ తనిఖీలలో ప్రకాశం జిల్లా మాదకద్రవ్యాల వ్యాప్తిని నిరోధించడానికి బలంగా ముందడుగు వేస్తోంది.
గంజాయి మరియు మాదకద్రవ్యాల సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972, డయల్ 112, లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266 కు తెలియజేయవచ్చు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీసులు తెలియజేశారు.
ఈ తనిఖీలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్, ఎస్సైలు శ్రీకాంత్, శివ రామయ్య, మధుసూదన రావు, ఈగిల్ టీం మరియు సిబ్బంది పాల్గొన్నారు.


